పామిడి పట్టణంలోని (సంతమార్కెట్టు) నారాయణ స్వామి వీధిలో నివాసముం టున్న మాజీ ఎంపిటిసి నల్లబోతుల శ్రీనివాసులు ఇంటిలో రూ. 4. 05 నగదు, 10 తులాల బంగారు నగలు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. శ్రీనివా సులు తమ బంధువులు అనారోగ్యంతో ఉండడంతో భార్యతో కలిసి ఆదివారం బళ్లారి వెళ్లారు. దీంతో మంగళవారం ఇంటి తలుపులు తెరిచి ఇండడంతో చుట్టుపక్కల వారు చోరీ జరిగినట్లు గ్రహించి సమాచారం ఇచ్చారు. వెంటనే వచ్చిన శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.