తాడిపత్రి: సర్ సివి రామన్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మంగళవారం తాడిపత్రి పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో చెత్తను తొలగించి మొక్కలను నాటారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ. ప్రకృతి సంపదను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని అన్నారు అనంతరం మొక్కల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ రైల్వే డీసీఎం రాజేంద్రప్రసాద్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పి నాగేంద్ర, సిఎస్ ఈ విభాగాధిపతి సి. రామిరెడ్డి, తాడపత్రి రైల్వే కమర్షియల్ ఆఫీసర్ హనక్ కుమార్, ఎన్. ఎం. ఆర్ అనిల్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.