అన్నమయ్య జిల్లా రాజంపేటలో మెయిన్ రోడ్డు కూడలిలో మార్కెట్ దగ్గర బిజెపి ఆధ్వర్యంలో ప్రజా పోరు సభ మంగళవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్టబోగుల ఆదినారాయణ హాజరయ్యారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నాగోత రమేష్ నాయుడు, రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందర ప్రజలకు తీయటి వాగ్దానాలు చేసి అవి నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు.