రాష్ట్ర వాల్మీకి బోయ సాధికార నూతన కమిటీ ఏర్పాటులో కడప జిల్లా పార్లమెంట్ కన్వీనర్ గా మండ్ల మల్లికార్జునరావును మంగళవారం నియమితులయ్యారు. ఈ సందర్బంగా ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నుకొన్నట్లు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి ఇచ్చిన పదవులను వమ్ము చేయకుండా అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. కన్వీనర్ ఎంపికకు సహకరించిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు, మల్లెల లింగారెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాసులరెడ్డి, నియోజకవర్గ ఇంచార్జిలకు, చైర్మన్ పూల నాగరాజు, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.