చిత్తూరు పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా జైలు నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు నగరంలోని గంగనపల్లి లోని మాజి మేయర్ కటారి హేమలత ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఇటీవల తమ అనుచరులపై అక్రమంగా కేసు పెడుతున్నారంటు అడ్డుకున్న హేమలత పైకి పోలీసులు వాహనం ఎక్కించడంతో గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను చంద్రబాబు పరామర్శించారు. వైసిపి దౌర్జన్యాలకు అక్రమాలకు, అన్యాయాలకు చమర గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. పోలీసుల కేసులకు టిడిపి నేతలు, కార్యకర్తలు భయపడ రన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.