నల్లవెంగనపల్లె సచివాలయం ఇన్చార్జ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వి ఎస్ యువరాజు పై దాడికి పాల్పడిన వాలంటీర్ భర్త వెంకటేశును అరెస్టు చేయాలంటూ మంగళవారం మండల గ్రామ సచివాలయ ఉద్యోగులు తాహాసిల్దార్ పుల్లారెడ్డి , ఎంపీడీవో సుధాకర్ రావు ను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. పదేపదే అనుచితంగా ప్రవర్తిస్తూ భౌతిక దాడి చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేస్తే ఐపిసి 323, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని చెప్పారు కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పై దాడికి పాల్పడిన వెంకటేష్ పై ఐపీసీ 332, 186, 189 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అతడిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు.