ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని వార్డుల్లో టిడిపి బలోపేతానికి చర్యలు: మాజీ ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 01:08 PM

బద్వేలు మున్సిపాలిటీ తేదేపా ముఖ్యనేతల సమావేశం బద్వేలు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నివాసంలో మున్సిపాలిటీ తెదేపా అధ్యక్షులు గుర్రంపాటి వెంగళరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ తేదేపా సభ్యత్వ నమోదు, బాదుడే - బాదుడు కార్యక్రమాలు, అక్టోబర్ నెల మొదటి వారం నుండి విస్తృతంగా నిర్వహించాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. మున్సిపాలిటీ వార్డుల వారిగా ముఖ్యకార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో పార్టీ బలోపేతానికి తమవంతుగా ప్రతి కార్యకర్త పాటుపడాలని ఈ సంధర్భంగా విజయమ్మ తెలియజేశారు. ఈ సమావేశంలో తేదేపా మున్సిపాలిటీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa