తమ్ముళ్లు భయపడకండి మీ కోసం నేనున్నా అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు , కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. చిత్తూరు జైలులో ఉన్న కుప్పం టిడిపి నేతలను పరామర్శించేందుకు ఆయన మంగళవారం తిరుపతి- చిత్తూరు రోడ్డు మార్గాన వెళుతుండగా పూతలపట్టు మండలం, పేటఅగ్రహారం వద్ద మహిళలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ సీఎం అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు , నాయకులు ఒక్కసారిగా వాహనం వద్దకు వెళ్లడంతో జడ్ క్యాటగిరి సిబ్బంది అతి కష్టం మీద వాహనాన్ని ముందుకు పంపారు.