కుప్పం పట్టణంలో పాత తహసిల్దార్ కార్యాలయ స్థానంలో ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ప్రారంభానికి సిద్దం అవుతోంది. అత్యాధునిక హంగులతో వివిధ శాఖల కార్యాలయాలను ఒకే చోట ఉండేలా గత ప్రభుత్వ హయంలో ఇంటిగ్రేటెడ్ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యింది. 23 న ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలో ఇంటిగ్రేటెడ్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. డాక్టర్ వైయస్సార్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ గా బోర్డును సైతం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం ప్రారంభం అయితే వివిధ శాఖల కార్యాలయాలన్ని ఒకే చోట ఉండటంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.