చిత్తూరు: కార్వేటి నగరం మండలంలోని రైతులకు 50 శాతం రాయితీతో పురుగుమందులు పిచికారి డ్రోన్లను అందిస్తామని ఏవో హేమలత తెలిపారు. ఒక డ్రోన్ ధర రూ. 10 లక్షలు ఉంటుందని, రైతులకు రూ. 5 లక్షలకే అందిస్తామని చెప్పారు. వ్యవసాయ శాఖ డీసీసీబీ బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తుందని పేర్కొన్నారు. 12 లీటర్ల పురుగు మందులను పిచికారి చేయవచ్చునని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు వెంటనే మండల వ్యవసాయాధికారిని సంప్రదించాలని సూచించారు.