విశాఖపట్నం: పెందుర్తి మండలం సుజాతనగర్ సమీపాన మంగళవారం మరో హత్య ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు విరాట్ నగర్ కాలనీ దగ్గరలో ఉన్న దేవాలయం లేఔట్ లో ఇంత సందీప్ (30 ) అనే యువకుడు హత్య గురయ్యాడు. అయితే కుటుంబ తగాదాల వల్లే హత్యకు కారణమని సమచారం. ఇదిలా ఉండగా సందీప్ ను తలపై రాయితో కొట్టి చంపారని పెందుర్తి పోలీసుల ప్రాథమిక నిర్ధారణ కు వచ్చారు. మృతుడు బావమరిది చక్క చిట్టిబాబు ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఘటన స్థలాన్ని నేరుగా పరిశీలించి పరిస్థితి సమీక్షించారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.