వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశుసంవర్ధకశాఖ పూర్తిగా నిర్వీర్యం అయిందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో మంగళవారం విమర్శించారు. మంత్రి అప్పలరాజు ఆ శాఖ గురించి తప్ప మిగతా విషయాలు మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చాలా వెటర్నరీ ఆసుపత్రులలో డాక్టర్లు లేరని మందులు కూడా బయట కొనుక్కోవాల్సి పరిస్థితి ఎదురవుతుందన్నారు. పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు తన శాఖకు సంబంధించిన విషయాలు తప్ప అన్ని విషయాలు మాట్లాడతారని విమర్శించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవనాధారమైన పాడి పరిశ్రమకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.