రొంపిచర్ల: కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 24న సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రొంపిచర్ల శాఖ కార్యదర్శి కామినేని రామారావు తెలిపారు. రొంపిచర్లలోని చెరువుకట్ట సెంటర్లో - మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో దేశ రక్షణ భేరి బహిరంగ సభ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. 24న విజయవాడలో నిర్వహించే బహిరంగ సభలో సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి పాల్గొనిప్రసంగిస్తారన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరాజు, బాలకోటయ్య, రామిరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.