నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గ పరిధిలోని రామలింగాపురం - హరనాధపురం సెంటర్ వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో యుద్ధప్రాతిపదికన ప్రజలకి ఇబ్బంది లేకుండా పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రేపటి నుంచి పాక్షికంగా మరో నాలుగు రోజుల్లో పూర్తిగా వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా కృషి చేయాలనీ అధికారులకు సూచించారు.