ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేర్ని నాని నోరు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 02:23 PM

రాష్ట్ర మొత్తం వేలాది మంది మీ మాటలకు నిను అసహ్యించుకుంటూ చీ కొడుతున్నా కూడా ఈ పేర్ని నాని ఎలాగ భరిస్తున్నారు అని అర్థం కావట్లేదు అని నెల్లూరు  జనసేన నాయకులూ మనుక్రాథ్ చెన్నారెడ్డి ఆగ్రహం వ్యక్త పరిచారు . మీడియా ముఖంగా అయన మాట్లాడుతూ....  అసలు అలాంటి బతుకు ఒక బ్రతుకేనా అని నేను పేర్ని నాని ప్రశ్నిస్తున్నాను ఇప్పటికైనా మాటలు మార్చుకోవాలి. ఈ వీళ్లకు ఒక ఇన్ సెక్యూరిటి నెక్స్ట్ ఎలక్షన్ లో వారు గెలవలేరేరని, ప్రజల్లో ఎంతో వ్యతిరేకత వచ్చింది అని ఒక భయం, జంకు వచ్చింది. కనీసం నియోజకవర్గంలో కూడా తిరగలేని పరిస్థితి ఉంది వీళ్ళు కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు.మేము ఒకటే చెబుతున్నాం ప్రజల ఆగ్రహానికి మీరు తప్పకుండా గురవుతున్నారు, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈసారి మీకు డిపాజిట్లు కూడా రావు. అ మీరు అసలు గడప గడపకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. మీ నాయకులు, మీ వైసీపీ పార్టీ మీ అసమర్థతని చూసి మిమ్మల్ని పక్కన పెట్టింది.


ఈ పేర్ని నానికి ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు ఇప్పుడు కన్నా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి, మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మటుకు ఘాటైన సమాధానం చెప్తాము.ప్రతిపక్ష నాయకులను గౌరవించడం నేర్చుకోండి మీరు ఎలానో ఫెయిల్యూర్ అయ్యారు. ప్రజలకు ఎలక్షన్ ముందు ఎన్నో వాగ్దానాలు చేసి అవి నెరవేర్చకుండా డైవర్షన్ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు అసలు డోర్ టు డోర్ వెళ్లే పరిస్థితి కూడా లేదు, చీపురుగట్ట తిరగేసి కొడతామంటూ డివిజన్లో ప్రజలు చెప్తున్నారంటే ఎంత దారుణంగా మీ పరిపాలన అనేది మీరు గ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అయన తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com