అవినీతిలో ఏ 1 జగన్ రెడ్డి అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడేళ్లలో జగన్ రూ. 2 లక్షల కోట్ల దోపిడీ చేశారు. లేపాక్షి భూములను జగన్ కుటుంబం కబ్జా చేస్తే, ఖాళీ స్థలాలను వైసిపి ల్యాండ్ మాఫియా కబ్జా చేస్తోంది. జగన్ రెడ్డి స్కాం రెడ్డి గా మారి, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు అని ఆగ్రహం వ్యక్తపరిచారు.భూ, ఇసుక, మద్యం, మైన్స్, బియ్యం దోపిడీకి వైకాపా నేతలు పాల్పడుతున్నారంటూ నిరసన తెలుపుతూ తెలుగుదేశం శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అసెంబ్లీ కి ర్యాలీగా వెళ్ళి, నినాదాలతో అసెంబ్లీ ముందు నిరసన తెలిపారు.