ఈ రోజు కాకినాడ జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS, గారు జిల్లా పోలీసు కార్యాలయం నుండి శ్రీ పి .శ్రీనివాస్, Addl.SP (Admin) మరియు DSEO, SEB గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న 7 SEB పోలీస్ స్టేషన్ ల SHOs, మరియు AES లతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
SEB స్టేషన్ ల SHOs అందరూ యాక్షన్ ప్లాన్ రూపొందించి స్థానిక పోలీసులు & ఫారెస్ట్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించాలి. పరివర్తన కార్యక్రమాన్ని ప్రజలలోనికి విస్తృతంగా తీసుకొని వెళ్ళి నాటుసారాయి తయారీ, అమ్మకాల నుండి మరలే విధంగా అవగాహన కల్పించాలి. ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పెండింగ్ ముద్దాయిల అరెస్ట్ లను పూర్తి చేయాలి.
జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేలా SEB అధికారులు అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని, కేసులలో పెండింగ్ అరెస్ట్ లపై దృష్టి సారించి త్వరితగతిన అరెస్ట్ లను పూర్తి చేయాలని సూచించారు.