కాకినాడ జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలోని వివిధ SEB స్టేషన్ ల నందు నాటుసారాయి మరియు అక్రమ మద్యం కేసుల్లో సీజ్ చేసిన మొత్తం 61 వాహనాలను ఈ రోజు అడిషనల్ SP అడ్మిన్ శ్రీ P.శ్రీనివాస్ మరియు అడిషనల్ SP (A.R). శ్రీ B.సత్యనారాయణ గార్ల పర్యవేక్షణలో అన్ని నిబంధనలను పాటిస్తూ వేలంపాట ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు నిర్వహించిన వేలంపాట కార్యక్రమానికి సుమారు 58 మంది బిడ్డర్ లు పాల్గొన్నారు. ఈ వేలంపాట కార్యక్రమంలో ఆశావాహులు వేలంలో మొత్తం 61 వాహనాలలో 61 వాహనాలను పాడుకున్నారు. ఈ 61 వాహనాలకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ద్వారా నిర్ణయించిన అప్ సెట్ ప్రైస్ మొత్తం Rs.2,87,600/- లకు గాను వేలం వేయగా వేలంపాటలో బిడ్డర్లు మొత్తం Rs.7,37,896/- లకు వారికి నచ్చిన వాహనాలను దక్కించుకున్నారు.