కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రవీంద్రనాథ్ బాబు,IPS., ఈరోజు పోలీస్ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా స్థానిక భానుగుడి రిజర్వ్ పోలీసు క్వార్టర్స్ సందర్శించి, వాటి అభివృద్ధి మరియు మరమ్మతుల పనులను పరిశీలించి వాటి అభివృద్ధి కోసం సూచనలు చేయడం జరిగింది. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రవీంద్రనాథ్ బాబు ఈరోజు మధ్యాహ్నం కాకినాడ పోలీస్ కార్యాలయం వెనుక ఉన్న పోలీస్ క్వార్టర్స్ ను అదనపు ఎస్పి Admn., శ్రీ పి శ్రీనివాస్, అదనపు ఎస్పీ AR., శ్రీ B. సత్యనారాయణ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం రమేష్ తో క్వార్టర్స్ మరియు పరిసరాలు, పరిసర ప్రాంతాలు చూసి తగిన సూచనలు చేయడం జరిగింది.