చిత్తూరు సబ్ జైల్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. పరామర్శించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగించినారు . టీడీపీ నేతలపై సుమారు 5 వేల కేసులు పెట్టారు. రాజకీయాల్ని నేరమయం చేశారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారు. మనకు నిజాయితీ ఉంది, నైతిక బలం ఉంది. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు, నేను అండగా ఉంటాను అన్న నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, పలు అంశాలను ప్రస్తావించారు.