రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నాయకులూ పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడానికి తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. జగన్ రెడ్డి గారికి ఎన్టీఆర్ పేరును మార్చే హక్కు లేదు. ఎన్టీఆర్ గారు నిర్మించిన విశ్వవిద్యాలయానికి వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం నిజంగా దౌర్భాగ్యం.అభివృద్ధి చేయడం చేతకాక ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసిపి పన్నుతున్న పన్నాగాలను ప్రజలందరూ గమనిస్తున్నారు అని తెలియజేసారు.