ఎన్టీ రామారావుగారికి నమ్మకద్రోహం చేసిన చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీ పార్టీకి ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అంబటి రాంబాబు అన్నారు. 5రోజులుగా టీడీపీ వాళ్ల పాలసీ రావడం, గొడవ చేయడం, సస్పెండ్ చేయించుకుని వెళ్లిపోవడం..బయట ఉండి ఇదంతా డైరెక్ట్ చేయిస్తుంది చంద్రబాబే..
సిగ్గుంటే టీడీపీ నేతలు తమ నాయకుడు చంద్రబాబుతో కలిసే సభకు రావాలని, అంతేగానీ వచ్చి సభను పదే పదే డిస్టర్బ్ చేయకూడదని హెచ్చరించారు అంబటి రాంబాబు. చంద్రబాబు కంటే కూడా ఎన్టీఆర్ పై గౌరవం మాకే ఉందన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఆయనను అగౌరవపరిచే ఉద్దేశం తమకు లేదని అసెంబ్లీ సభ సాక్షిగా స్పష్టం చేసారు.