తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గాంధీనగర్ రమ్య ఆస్పత్రిలో దారుణం జరిగింది. కడుపులో బిడ్డ లేకున్నా గర్భవతి అని చెప్పి 9 నెలలు వైద్యులు చికిత్స చేశారు. సెప్టెంబరు 22న డెలివరీ అని చెప్పారు. పుట్టింటికి వెళ్లిన మహాలక్ష్మీని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయగా అసలు ఆమె గర్భవతే కాదని తేల్చారు. దీంతో షాకైన వారు తిరిగి రమ్య ఆస్పత్రికి వచ్చి అడుగగా వైద్యురాలు పొంతన లేని సమాధానం చెప్పింది. మోసం చేశారని మహాలక్ష్మీ బంధువులు ఆందోళన చేశారు.