యూపీలోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. ఆశాదేవి (33) అనే మహిళ భర్తను వదిలేసింది. కొన్నాళ్లుగా మొరాదాబాద్‌కు చెందిన నదీమ్ అహ్మద్ (25)తో సన్నిహితంగా ఉంటోంది. ఆమె తనను దూరం పెడుతుండడం నదీమ్ తట్టుకోలేకపోయాడు. సెప్టెంబర్ 16న ఆశాదేవిపై గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. ఫ్లాట్ యజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులు హత్యగా తేల్చారు. నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు.