ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఏపీ ప్రభుత్వం మార్చడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం స్పందించారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా పేర్లు మార్చితే ప్రయోజనం ఉంటుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రభుత్వాసుపత్రిలో కనీస వసతులు లేవని అన్నారు. పేరు మార్చుకుంటే వైద్య ప్రమాణాలు మెరుగుపడదా అని ప్రశ్నించారు. విశాఖ కేజీహెచ్‌కి బ్రిటీష్ పేరు ఉందని, దాన్ని మార్చితే బాగుంటుంది.