స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 262 పాయింట్లు నష్టపోయి 59,456 వద్ద ముగిసింది. నిఫ్టీ 97 పాయింట్లు నష్టపోయి 17,718 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హిందుస్థాన్ యూనిలీవర్ (1.60%), ఐటీసీ (1.59%), బజాజ్ ఫైనాన్స్ (0.76%), టెక్ మహీంద్రా (0.51%), రిలయన్స్ (0.29%).
టాప్ లూజర్స్ : ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.19%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.64%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.40%), ఎల్ అండ్ టీ (-1.88%), ఎన్టీపీసీ (-1.83%).