వైయస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని మంత్రి కారుమూరి తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు రాజ్యసభకు వెళ్లారో ప్రజలకు తెలుసు. మంత్రి వర్గంలోని 25 మందిలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా బీసీలకు ప్రాధాన్యత ఉందా అని ప్రశ్నించారు.
ఆరోగ్య శ్రీ అంటే వైయస్ గుర్తుకు వస్తారు. అందుకే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ పేరు పెట్టాము. తణుకులో బీసీ కమ్యూనిటీ హాలుకు జ్యోతి రావు పూలే పేరు పెడితే టీడీపీ హయాంలో ఆ పేరు మార్చి ఎన్టీఆర్ పేరు పెట్టారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు వైయస్ కృషి చేశారు. అందుకే ఆయన పేరు పెట్టాలని ఎక్కువ మంది కోరారని మంత్రి వివరించారు.