కుప్పం గొడవల్లో అరెస్టయిన తెలుగుదేశం నాయకులను పరామర్శించడానికి మంగళవారం చిత్తూరు జైలుకు వచ్చిన టీడీపీ అధినేత ఏ మాత్రం మారలేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 1989 డిసెంబర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సీటు తన సొంతమన్నట్టు టీడీపీ మాజీ సీఎం మాట్లాడడం– ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ‘గ్లోబల్’ నాయకుడు ఇప్పుడు ఎంతటి ‘లోకల్’ నేతగా మారిపోయాడు? అనే అనుమానం రేకెత్తిస్తోంది. రాష్ట్రస్థాయి నాయకులను ముఖ్యంగా ముఖ్యమంత్రి, మాజీ సీఎంలను వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలతో గుర్తుంచుకోవడం చంద్రబాబుతోనే మొదలైంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రముఖుల నియోజకవర్గాలకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం వాంఛనీయం కూడా కాదు. ‘నేను మీ అసెంబ్లీ స్థానానికి నీళ్లిస్తే, నా కుప్పం నియోజవర్గానికి ఎం చేశారు?’ అనే ధోరణి చంద్రబాబు స్థాయిని మరింత దిగజార్చేలా ఉంది అని అయన వాపోయారు.