సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవెన్, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.