ప్రొద్దుటూరు 38 వ వార్డులో బుధవారం సాయంత్రం కౌన్సిలర్ పల్లారమాదేవి, వార్డు ఇంచార్జ్ పల్లా సురేష్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పాల్గొని ఆ వార్డులో గల ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటూ జగనన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలతో మాట్లాడుతూ వార్డులో పర్యటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీముని పల్లి లక్ష్మీదేవి నాగరాజు, టీడీ పాలకమండలి సభ్యుడు మారుతి ప్రసాద్, వైసీపీ పట్టాణాధ్యక్షడు కామిశెట్టి బాబు, కోనేటి సునంద, హౌస్ బిల్డింగ్ సొసైటీ ద్వార్శల భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు ఇర్ఫాన్ బాష, గరిశపాటి లక్ష్మిదేవి, తదితరులు పాల్గొన్నారు.