తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక కీ॥అన్న నందమూరి తారక రామారావు . దేశ చరిత్రలోనే తెలుగువారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి కృషి చేసిన వ్యక్తి ఆయన. అటువంటి మహనీయుడు పేరు ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం అత్యంత బాధాకరం అని టీడీపీ నాయకులూ యరపతినేని శ్రీనివాసరావు అవేధనవ్యక్త పరిచారు.
ఈ విషయంపై స్పందించిన అయన మాట్లాడుతూ... చంద్రబాబు హైదరాబాదులో బ్రహ్మానందరెడ్డి పార్క్ పెట్టారు. సంజీవరెడ్డి విగ్రహం పెట్టారు. దామోదర సంజీవయ్య పార్క్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సెంటర్ పెట్టారు. అప్పటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పార్టీలకతీతంగా నాయకులను గౌరవించారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరు హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టారు.
కడప జిల్లాకు "వైఎస్" పేరు పెట్టారు. అయినా టిడిపి ప్రభుత్వం ఆ పేర్లు మార్పు చెయ్యలేదు. ఎన్టీఆర్ ఒక పార్టీ ఆస్తి కాదని జగన్ రెడ్డి, వైకాపా నేతలు చెప్పారు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ పేరు పెట్టడం ఉన్మాదం కాదా? జగన్ రెడ్డి తన దోపిడీ, అరాచకాలు, మోసాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రాంతీయ, కుల చిచ్చుకు కుట్రలు చేస్తున్నారు. జగన్ రెడ్డి తన తప్పుడు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తెలుగు ప్రజలు గట్టి గుణపాఠం చెప్తారు అని హెచ్చరించారు.