ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ రెడ్డి వికృత చేష్టలు మానాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 12:53 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయని బుదవారం రాయచోటి నియోజవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ టీటీడీ పాలకమండలి సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ 1986 లో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ పేరును 1998 లో ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్చారని వివరించారు. చంద్రబాబు నాయుడు హయాంలో పలువురు రాజకీయ నాయకుల విగ్రహాలు అంబేద్కర్ వంటి మేధావుల విగ్రహాలను నెలకొల్పి పలు విద్యాసంస్థల కు వారి పేర్లను పెట్టారని అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ తెలుగు వారి మనోభావాలను కించపరుస్తున్నారన్నారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు ఒక పార్టీకి చెందిన వాడు కాదని తెలుగు వారందరి వాడని అదే పార్టీకి చెందిన వారు చెప్పిన వినకుండా పేరు మార్చడం దుర్మార్గం అన్ని సుగవాసి ప్రసాద్ బాబు ఆవేదన వ్యక్తం చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com