అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో గురువారం పెద్ద బొడ్డేపల్లి వైయస్సార్ పార్టీ కార్యాలయంలో నియోజవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని అలాగే మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేటట్టు చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.