బాపట్ల జిల్లా చుండూరు మండల పరిధిలోని పెనుగుదురుపాడు గ్రామ సచివాలయ పరిధిలోని బొద్దులూరుపాడు గ్రామంలో బుధవారం రాత్రి గ్రామ సచివాలయ సిబ్బందితో, వాలంటీర్లతో, గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ప్రతి గృహాన్ని సందర్శించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి కరపత్రాల ద్వారా వివరించారు.