ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినందుకు నిరసనగా సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్షకు దిగారు. ఎన్టీఆర్ పేరు మారుస్తూ తీర్మానం చేసిన అసెంబ్లీ తీర్మానం కాపీలను దగ్ధం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం వైసిపి దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ లో టిడిపి చేపట్టిన దీక్షకు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.