ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చటం పట్ల రేపల్లెలో తెలుగుదేశం శ్రేణులు బగ్గుమన్నాయి. గురువారం రేపల్లె టిడిపి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు అసెంబ్లీ తీర్మానం కాపీలను దగ్ధం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి దేశవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చిన ఎన్టీఆర్ పేరు తొలగించి యూనివర్సిటీతో ఏ మాత్రం సంబంధం లేని వైయస్సార్ పేరు పెట్టటం సీఎం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.