కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దేశ రక్షణ ప్రచార యాత్ర రేపల్లెలో రెండో రోజు నిర్వహించారు. గురువారం బేతపూడిలో జరిగిన దేశ రక్షణ ప్రచారంలో సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణిలాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందని విమర్శించారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు.