NTR హెల్త్ యూనివర్సిటీ పేరుని YSR హెల్త్ యూనివర్సిటీ గా మారుస్తూ.. జరిగిన అసెంబ్లీ సమావేశాలలో వైసీపీ పార్టీ నేత , ప్రస్తుత సీఎం జగన్ బిల్లుని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై ఇప్పటికే పలువురు స్పందించగా, తాజాగా జూనియర్ NTR స్పందిస్తూ... NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు, NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు అని సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు.