ఆస్ట్రేలియాలోని వోల్లోంగాంగ్లోలో నిర్వహిస్తున్న రోడ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మిక్స్డ్ టీమ్ ట్రయల్ రెండో రౌండ్ పోటీల్లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన వ్యాన్ లూటెన్ కు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనున్న బ్యారియర్‌ను ఢీకొనడంతో ఆమె మోచేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ వీడియోను ది యూనియన్ సైక్లిస్ట్ ఇంటర్నేషనల్ ట్విటర్లో షేర్ చేయగా వైరలవుతోంది.