మేఘాలు సముద్రపు అలలై ప్రళయంలా కనిపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దట్టంగా మబ్బులు పట్టి, చీకటిగా ఉండి సముద్రపు అలల మాదిరిగా అవి విరుచుకుపడుతున్నాయి. భూమి ఉపరితలాన్ని సైతం అవి పూర్తిగా కప్పేస్తూ కనువిందు చేశాయి. వాటికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా అవుతోంది. ఆ మేఘాలు అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.