తమ సంస్థలో సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లు, పైలట్లకు 'స్పైస్ జెట్' గుడ్ న్యూస్ చెప్పింది. 20% జీతాలు పెంచుతునట్లు ప్రకటించింది. అక్టోబర్ నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. గత నెలలలో పైలట్ల జీతాన్ని సంస్థ 6% పెంచింది. కేంద్రం నుంచి ECLGS నిధులు అందడంతో ఉద్యోగులకు వేతనం పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. 2 రోజుల క్రితం 80 మంది పైలట్లను 3 నెలల వేతన రహిత సెలవుల్లోకి వెళ్లాలని 'స్పైస్ జెట్' ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa