ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఏపీయస్ఆర్టీసి సిద్ధమైంది. 'స్టార్ లైనర్' పేరిట 62 నాన్ ఏసీ స్లీపర్ బస్సులను.. ఈ దసరా నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ప్రయోగాత్మకంగా ఈ సర్వీసులు నడుపుతున్నామని.. మంచి ఫలితాలు వస్తే వీటిని కొనసాగిస్తామని సంస్థ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. అటు దసరాకు 4,100 పత్యేక బస్సులను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా నడుపుతున్నట్లు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa