ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోర్టులో కలకలం.. ఢిల్లీ హైకోర్టు విచారణ మధ్యలో అశ్లీల వీడియోలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 29, 2026, 09:30 PM

Delhi High Court వర్చువల్ విచారణలో చోటుచేసుకున్న ఈ అవాంఛనీయ ఘటన న్యాయవ్యవస్థ భద్రతా లోపాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. సైబర్ నేరగాళ్ల దూకుడుకు ఇది పరాకాష్టగా నిలిచిందని భావిస్తున్నారు.*విచారణలో షాకింగ్ దృశ్యాలు : Delhi High Court ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం ఒక కేసును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తున్న సమయంలో మధ్యలో అనూహ్యంగా అశ్లీల వీడియోలు స్క్రీన్‌పై కనిపించాయి.ఈ పరిణామంతో ఆందోళనకు గురైన అధికారులు వెంటనే విచారణను నిలిపివేశారు. అనంతరం తిరిగి విచారణ ప్రారంభించినప్పటికీ మరో రెండుసార్లు కూడా అదే విధంగా అశ్లీల వీడియోలు ప్రసారమయ్యాయి. ఆ తరువాత “You are hacked” అనే సందేశం కూడా కనిపించింది.
*విచారణ నిలిపివేత – కేసు నమోదు : ఈ ఘటన నేపథ్యంలో వర్చువల్ విచారణను పూర్తిగా నిలిపివేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది.Delhi Policeకు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. హైకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థపై సైబర్ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి వర్చువల్ విచారణలోకి ప్రవేశించి అశ్లీల వీడియోలను ప్లే చేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa