విధి నిర్వహణలో భాగంగా ఇండోనేషియాకు వెళ్లిన Air Indiaకు చెందిన ఓ సీనియర్ పైలట్ అక్కడ ఆకస్మికంగా మృతిచెందారు.ఇండోనేషియాలోని Baliలో ఉన్న ఓ హోటల్‌లో బస చేసిన సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. మరణించిన పైలట్‌ను ఎయిరిండియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ కమాండర్‌గా గుర్తించారు. ఆయన ఢిల్లీ నుంచి బాలికి విమానాన్ని నడిపిన తర్వాత, తిరుగు ప్రయాణానికి ముందు లేయోవర్ సమయంలో హోటల్ గదిలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.హోటల్ సిబ్బంది ఆయనను అపస్మారక స్థితిలో గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనను Air India యాజమాన్యం ధృవీకరించింది. పైలట్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు, అలాగే భౌతికకాయాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ ఘటనతో విమానయాన రంగంలో పైలట్ల పని ఒత్తిడిపై మరోసారి చర్చ మొదలైంది. ఇటీవలి కాలంలో పైలట్లు గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీర్ఘకాల పని గంటలు, అలసట (Fatigue), మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని విమానయాన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది కాలంలో ఇలాంటి ఘటనలు పెరగడంపై పైలట్ల సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa