తాజాగా హీరో మోటో కార్ప్ సంస్థ తన ద్విచక్ర వాహనాల ధరలను పెంచింది. ఒక్కో వాహనంపై రూ.1,000 పెంచుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు గురువారం హీరో మోటో కార్ప్ నుంచి ఓ ప్రకటన జారీ అయ్యింది. వాహనాల తయారీ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో బైకుల ధరలు పెంచక తప్పడం లేదని ఆ సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా ఈ ధరల పెంపు తక్షణమే అమలులోకి వస్తుందని కూడా హీరో తెలిపింది. తాను విక్రయిస్తున్న మోటార్ సైకిళ్లతో పాటు స్కూటర్లకు కూడా ఈ ధరల పెరుగుదల వర్తిస్తుందని వెల్లడించింది.