ఇటీవల కాలంలో ఉగ్రవాద ఆరోపణలతో పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలను ఎన్ఐఏ అరెస్ట్ చేస్తోంది. దీనిని నిరసిస్తూ పలువురు కేరళలో ఆందోళనలు చేపడుతున్నారు. రాళ్ల దాడుల వల్ల అలప్పుజా, కన్నూర్, కోజికోడ్, తిరువనంతపురంలో 12 కేఎస్ఆర్టీసీ బస్సులు దెబ్బతిన్నాయి. దీంతో అలువా ప్రాంతంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ హెల్మెట్ ధరించి బస్సు నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.