డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మరింత పడిపోయింది. చరిత్రలో అత్యల్పంగా శుక్రవారం 81 కి చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో రూపాయి పతనమైంది. డాలరుతో పోల్చితే రూపాయి విలువ 44 పైసలు తగ్గి 81.09 కు పడిపోయింది. గురువారం రూపాయి విలువ 83 పైసలు పతనమై 80.79కి చేరిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 24 తర్వాత ఒక్కరోజులో ఈ స్థాయిలో రూపాయి విలువ పడిపోవడం ఇదే తొలిసారి.