భారతదేశంలో కొత్త టెలికాం ఫ్రేమ్‌వర్క్ రూపకల్పన దిశగా, కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ కొత్త టెలికమ్యూనికేషన్స్ బిల్లు 2022ను విడుదల చేసింది. కొత్త టెలికమ్యూనికేషన్ బిల్లు, 2022పై వ్యాఖ్యానిస్తూ, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ ఆశిష్ అగర్వాల్ మాట్లాడుతూ వివిధ రకాల లైసెన్సులకు సంబంధించిన నిబంధనల రూపకల్పనకు ఇది మార్గనిర్దేశం చేయగలదని ఆయన అన్నారు. ఆవిష్కరణలు అధికంగా ఉండే విలువ ఆధారిత సేవలలో వివిధ చట్టాల అంతటా నియంత్రణ భారం, అనిశ్చితి మరియు అతివ్యాప్తులను తగ్గించడం చివరి బిల్లు లక్ష్యంగా ఉండాలి.