ఏపీలోని స్కూళ్లకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. అయితే దీనికి విరుద్ధంగా కొన్ని ప్రైవేట్ స్కూళ్లు క్లాసులు నిర్వహిస్తున్నాయి. కొన్ని చోట్ల ఈ నెల 30 వరకు స్కూళ్లకు రావాలని యాజమాన్యాలు చెప్పడంతో విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి.. తమకు సెలవులు ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.