భారత్, చైనా సరిహద్దు వివాదం రెండు దేశాల ద్వైపాక్షిక సమస్య అని.. చర్చల ద్వారా ఆ దేశాధినేతలే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారని రష్యా వ్యాఖ్యానించింది. ఈ వివాదంలో తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చోసుకోబోమని స్పష్టం చేసింది. భారత్ కు అందించాల్సిన S-400 వాయు క్షిపణి వ్యవస్థను షెడ్యూల్ ప్రకారం అందిస్తామని రష్యా తెలిపింది. 2018లో S-400 వ్యవస్థ కోసం రష్యా-భారత్ మధ్య 5 బిలియన్ డాలర్ల ఒప్పందం కూడా జరిగింది.